అరుంధతీరారుపై కేసు!

Case against Arundhatiraru!న్యూఢిల్లీ : 2010లో జమ్ముకాశ్మీర్‌పై వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ప్రముఖ రచయిత్రి అరుంధతీరారు, కాశ్మీర్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్‌ షేక్‌ షోకత్‌ హుస్సేన్‌లపై విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినరుకుమార్‌ సెక్సెనా అనుమతించారు. దేశ రాజధానిలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలకు గాను న్యూఢిల్లీలోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. చట్టవ్యతిరేక కార్యక్రమాలు (నివారణ)చట్టం (ఉపా) 1967 సెక్షన్‌13 కింద ఈ కేసు నమోదైనట్టు సమాచారం. ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న కాశ్మీరీ వేర్పాటువాద నాయకులు సయ్యద్‌ అలీ సాహా గిలానీ, ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకులు సయ్యద్‌ అబ్దల్‌ రహ్మాన్‌ గిలానీ విచారణ సమయంలోనే మరణించారు. దేశద్రోహం ఆరోపణల కింద ఈ కేసును విచారణ చేస్తామని ఢిల్లీ పోలీసులు అభ్యర్థించినా, సుప్రీంకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఈ అభ్యర్థననను తిరస్కరించామని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం తెలిపింది. జమ్మూకాశ్మీర్‌కు చెందిన సామాజిక కార్యకర్త సుశీల్‌ పండిట్‌ చేసిన ఫిర్యాదు మేరకు 2010 అక్టోబర్‌ 28న ఈ కేసు నమోదయింది.