హేమంత్‌ సోరేన్‌పై కేసు

హేమంత్‌ సోరేన్‌పై కేసు– మూడో వ్యక్తిని అరెస్టు చేసిన ఈడీ
రాంచీ : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌పై విచారణ జరుగుతున్న మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మూడో వ్యక్తిని అరెస్టు చేసింది. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద మహమ్మద్‌ సద్దాంను ఈడీ కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. రాంచీలో హేమంత్‌ సోరేన్‌ అక్రమంగా ఆక్రమించుకున్న 8.86 ఎకరాల భూమికి సంబంధించిన నకిలీ పత్రాలను సద్దాం సృష్టించాడని ఈడీ ఆరోపిస్తుంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే హేమంత్‌ సోరేన్‌ను, జార్ఖండ్‌ రెవిన్యూ శాఖ మాజీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ భాను ప్రతాప్‌ ప్రసాద్‌ను ఈడీ అరెస్టు చేసింది.