పేకాటరాయుళ్లపై కేసు 

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణం ప్రాంతంలో పేకాట ఆడుతున్న పదిమంది పేకాట రాయుళ్లపై వన్ టౌన్ పోలీస్ లు  కేసు నమోదు చేశారు. వారి నుండి 43041 రూపాయల నగతు, ఐదు మోటార్ సైకిల్ లు, పది మొబైలు ఫోన్లు స్వాదీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. విషయాన్ని వన్ టౌన్ సిఐ సత్యనారాయణ వెల్లడించారు.