పేకాట రాయుళ్ల పై కేసు నమోదు..

నవతెలంగాణ-రాయికల్: మండలంలోని సింగారావుపేట గ్రామ శివారులో ఏడుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారంతో
పేకాట శిబిరం వద్ద తనిఖీ చేయగా అందులో నుండి ముగ్గురు వ్యక్తులు పారిపోగా నలుగురిని పట్టుకొని, వారి వద్ద నుండి రూ.3810 నగదు సీజ్ చేసి ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ఈ తనిఖీల్లో సిబ్బంది మహేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.