ఇద్దరు యువకులపై కే సు నమోదు

 నవతెలంగాణ ఆర్మూర్  
ఎమ్మెల్యే పోస్టర్లు అతికించిన నందిపేట్ మండలానికి చెందిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై చిరంజీవి  తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే ఫోటోతో అతికించిన యువకులపై నందిపేట్ పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు జోద్ పూర్ గ్రామానికి చెందిన బచ్చు రాము, నందిపేట్ కు చెందిన మచ్చర్ల విజయ్ సామ్రాట్ లపై కేసు నమోదు అయినట్టు తెలిపారు ఐపిసి 153, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.