20 లీటర్ల గుడుంబా స్వాధీనం కేసు నమోదు

నవతెలంగాణ-గోవిందరావుపేట
20 లీటర్ల ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థమైన గుడుంబాను కలిగి ఉన్న వ్యక్తిని ఆదివారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పసర ఎస్ఐ ఏ కమలాకర్ తెలిపారు. ఎస్ ఐ కథనం ప్రకారం తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు రాంనాగర్ గ్రామం లో గుడుంబా తయారు చేసి విక్రయిస్తున్నారు అని సమాచారం రాగా ఆ గ్రామము లో తనిఖీ చేయగా ఆ గ్రామానికి చెందిన భూక్య అమర్ సింగ్   రాంనగర్ అను వ్యక్తి ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారు చేసి విక్రయిస్తుండటం తో అతడిని పట్టుకొని అతని నుండి 20 లీ గుడుంబాని స్వాధీనం చేసుకొని  కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా పసర ఎస్ఐ కమలాకర్ మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారు చేసిన విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.