ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి

– ఇబ్రహీంపట్నం డివిజన్‌ కార్యదర్శి ఏర్పుల తరంగ్‌
– ఇబ్రహీంపట్నం మండల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ రంగారెడ్డి ప్రతినిధి
హెచ్‌సీయూలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్ధి నాయకులపై పెట్టిన అక్రమ కేసులు,అక్రమ సస్పెన్షన్‌ ఎత్తివేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఇబ్రహీంపట్నం డివిజన్‌ కార్యదర్శి ఏర్పుల తరంగ్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శీటీ హెచ్‌సీయూలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై అక్రమంగా పెట్టిన కేసులను, విధించిన సస్పెన్షన్‌ తక్షణమే ఎత్తివేయాలని, వైస్‌ – ఛాన్సలర్‌ నియంతత్వ పోకడలతో విద్యార్ధులకు తీవ్ర నష్టం జరుగుతుందని తక్షణమే వీ.సీ తీసుకున్న నిర్ణయ వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలో బస్టాండ్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ఇబ్రహీంపట్నం డివిజన్‌ అధ్యక్ష,కార్యదర్శులు బోడ వంశీ, ఏర్పుల తరంగ్‌ లు మాట్లడుతూ… విద్యార్ధులు హక్కులు తెలియజేయడానికి విద్యార్ధులు ఎన్నుకున్న యూనివర్శీటీ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు అతీక్‌ అహ్మద్‌, మరియు ఎస్‌ఎఫ్‌ఐ యూనిట్‌ కార్యదర్శి కపా జార్జ్‌ వీరీతో పాటు మరో 08 మంది విద్యార్థులు 6 నెలలు సస్పెన్షన్‌, పదివేల రూపాయలు ఫైన్‌ విధించడం అడ్మిన్‌ చర్యలు విద్యార్ధుల చదువులకు నష్టం కల్గించే చర్యలు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. సస్పెన్షన్‌ చేసిన విద్యార్థులు అట్టడుగున ఉన్న నిరుపేద సామాజిక నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వచ్చిన వారని, విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న విద్యార్ధులను సస్పెన్షన్‌ చేయడం కాకుండా, వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఈ యూనివర్శీటీలో 8 యేండ్లు క్రితం రోహిత్‌ వేముల కూడా ఇదే రకంగా సస్పెన్షన్‌ గురి చేసి హత్య చేసిందని తెలిపారు. తక్షణమే విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ రద్దు చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని, ఛలో హెచ్‌.సి.యు. కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఇబ్రహీంపట్నం మండల డివిజన్‌ కమిటీ సభ్యులు వినోద్‌, శివ, చందు పాల్గొన్నారు.