దర్జాగా పుట్ పాత్ ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్న నాలుగు షాపు యజమానులపై సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులు కేసునమోదు చేశారు. జాంబాగ్ ఫ్రూట్ మార్కెట్ పరిధిలో సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పుట్ పాత్ కబ్జా చేసి వ్యాపారాలకు ఉపయోగిస్తున్న నాలుగు షాపుల యజమానులపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లలో ఒక కేసు నమోదు కోసం ఫిర్యాదు చేసినటు సుల్తాన్బజార్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఎన్ రాంబాబు తెలిపారు. రాజేంద్రనగర్ హసన్ నగర్ కు చెందిన అజారుద్దీన్ ఫ్రూట్ మార్కెట్ ఎదురుగా గల పుట్ పాత్ ను ఆక్రమించి ఫ్రూట్ కంపెనీ పేరిట, రాజేంద్రనగర్చెం కు చెందిన సయ్యద్ అశ్రఫ్ అల్ నూర్ ఫ్రూట్ ట్రేడర్స్ పేరిట వ్యాపారాలు నిర్వహిస్తున్న సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దర్జాగా పుట్ పాత్ ను కబ్జా చేసి నఫీజ్ ఫ్రూట్స్ పేరిట వ్యాపారం నిర్వహిస్తున్న ఆసిఫ్ నగర్ కు చెందిన మహ్మద్ అన్వర్, మాషా అల్లా ఫ్రూట్స్ పేరిట వ్యాపారం చేస్తున్న మాసబ్ ట్యాంక్ జిర్రా ప్రాంతానికి చెందిన మహ్మద్ జాఫర్లపై అఫ్టల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇకపై పుట్ పాత్ ను సొంత వ్యా పారాల కోసం ఆక్రమించి వినియోగించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ స్పెక్టర్ ఎన్ రాంబాబు హెచ్చరించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఎస్ఐ సుధాకర్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.