
చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామానికి చెందిన ముప్పిడి విష్ణుకి రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు యముడాల సాయికృష్ణ భర్తీ ఫౌండేషన్ అధ్యక్షులు జాలిగామ నాగరాజు లకు తెలియజేయడం తో ఫౌండేషన్ సభ్యుల సహకారంతో రూ.5000/-రూపాయలు ఆర్థిక సహాయం బుధవారం చేశారు. ఈ సందర్భంగా సాయి కృష్ణ నాగరాజులు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మరువలేనిది అని అన్నారు. ఈ కార్యక్రమానికి పంచాయితీ కార్యదర్శి బాలకృష్ణ,ఫౌండేషన్ సభ్యులు టంగుటూరి కిరణ్,మేఘవత్ పరమేష్, చెరుకు శ్రీరామ్ గ్రామస్థులు బత్తుల సింహాచలం,జంగం నవీన్,సాయి కిరణ్,గుడ్డేటి శ్రీకాంత్,చెన్నోజు రాఘవేంద్ర చారి, సామిడి బాల్ రెడ్డి,చెరుకు శ్రీశైలం,దాసరి శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.