బొడ్రాయి ఉత్సవాలకు రూ.లక్ష పదహార్లు విరాళం అందజేత


నవతెలంగాణ-వీణవంక
మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో భూ లక్ష్మి-మహాలక్ష్మి (బోడ్రాయి) ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఉత్సవాలకు గాను మాజీ మంత్రి హుజూరాబాద్ శాసన సభ్యులు ఈటల రాజేందర్ సతీమణి జమున హాజరై ప్రత్యేక పూజలు చేసి పోచమ్మ మొక్కులు చెల్లించారు. అనంతరం రూ.లక్ష పదహారు సర్పంచ్ మేకల ఎల్లారెడ్డికి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆదిరెడ్డి, బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతం రెడ్డి, పల్లెర్ల కిరణ్, కర్రె నాని, సురేందర్ రెడ్డి, దూలం సురేష్, తిరుపతి రెడ్డి, కొలిపాక శ్రీను, దూలం కనకయ్య, శంకర్, పెద్దులు, సమ్మయ్య, ప్రశాంత్, సాయి తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.