నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని నాగారం మధిర కమ్మగూడెం వద్ద మంగళవారం స్థానిక పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం కు చెందిన గరుదాసు శివకుమార్ తన మోటారుసైకిల్ పై ఎలాంటి ఆధారాలు లేని నగదు రూ. 5,04, 569 రూపాయలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని పై అధికారుల ఆదేశాల మేరకు భువనగిరిలో ట్రెజరీలో జమ చేయనున్నట్లు ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.