కులగణన సర్వేను ప్రభుత్వ సెలవదినం ప్రకటించాలి

-  తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ–  ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పగడ్బందీగా నిర్వహించాలి
– సమగ్ర కులగణలో భాగస్వామ్యం కావాలి ,ప్రజలందరూ సహకరించాలి
–   తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ
న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్
రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య ,ఉపాధి, రాజకీయ ,కుల సర్వే పేరుతో ఇంటింటి సర్వే నిర్వహిస్తోందని, సర్వేను వెన్యుమనేటర్లు, ఆశ వర్కర్లు కులగలను పగడ్బందీగా నిర్వహించాలి ఆయ‌న అన్నారు రాజకీయ పార్టీలు సహకరించాలి ప్రజలందరూ భాగస్వామ్యం అవ్వాలని తెలిపారు. ప్రజల్లో సమగ్ర కుల గణన పై అవగాహన లేక వివరాలు నమోదు చేసుకోవడం లేదు ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం టీవీల్లో డిజిటల్ యాడ్స్ పేపర్ యాడ్స్ తో పాటు కుల సంఘ నాయకులతో చర్చించాలని ,ప్రజలకు అవగాహన కల్పించాలి చెప్పారు.
ఎన్యూమనేటర్లు, ఆశా వర్కర్లు ఇంట్లో లేనప్పుడు సభ్యులు ఉద్యోగాలకు, కూలి పనులకు వెళ్లే వారి యొక్క వివరాలు ఎవరు చెబుతారు మళ్లీ సర్వే కి వస్తారా అని ప్ర‌శ్నించారు. ప్రభుత్వం సెలవు ప్రకటించి పగడ్బందీగా ప్రజల్లో అవగాహన కల్పించి సర్వే నిర్వహించాలి అప్పుడే కుల గణన యొక్క లక్ష్యం నెరవేరుతుంది అబిప్రాయప‌డ్డారు