కులగణన నిర్వహణ, గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాన సమస్యల్లో ఒకటిగా ఉంది. ఇండియా కూటమి ఈ సమస్యను చాలా బలంగా ముదుకు తీసుకొస్తే, బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ వ్యతిరేకత చాలా స్పష్టంగా, నిస్సందే హంగా ఉంది. హిందూ మితవాద రాజకీయాల్ని బలోపేతం చేయడంలో కుల సమస్య ప్రధానమైన అంశంగా ఉంది.
అణగారిన వర్గాల దోపిడీకి సంబంధించిన అవగాహనను జ్యోతీరావ్ ఫూలే, భీమ్‌రావ్ అంబేద్కర్‌లు గుర్తించారు. దీనికి ప్రతిస్పందనగా అగ్రకుల సంఘాలు, వారి ఎజెండాలో భాగంగా మనుస్మతి విలువల్ని, హిందూరాజ్య భావ కలిి వైభవోపేతమైన గతాన్ని గురించి వివరించడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా గడిచిన కొన్ని దశాబ్దాల్లో, అన్ని కులాలు సమానమే అంటూ వారి సిద్ధాంతకర్తలు, కుల సమానత్వానికి సంబంధించిన వివిధ కులాల చరిత్ర రచనలతో బయటకు వచ్చారనే కథనాన్ని ఆరెస్సెస్ ప్రచారం చేస్తుంది. ఈ కులాలు విదేశీ దురాక్రమణదారుల అకృత్యాల వల్లే ఉనికిలోకి వచ్చాయనీ, ఇంతకు ముందు హిందూ మతంలో వీటి ఉనికే లేదని ఆరెస్సెస్ నాయకులు వాదించారు. ముగ్గురు ఆరెస్సెస్ అగ్రనాయకులు, దళితులు, గిరిజనులు, ఇతర అనేక సమూహాల మూలాలను మధ్యయుగాల్లో ”ముస్లింల దండయాత్రకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆరెస్సెస్ అగ్రశ్రేణి నాయకుడైన భయ్యాజీ జోషి చెప్పిన మాట ప్రకారం, హిందూ గ్రంథాల్లో ‘శూద్రులు’ ఎప్పటికీ అస్పృశ్యులుగా లేరు. మధ్యయుగాల కాలంలో జరిగిన ఇస్లాం దారుణకృత్యాల ఫలితంగానే అస్పృశ్యులు, దళితులు ఆవిర్భవించారు. ‘చన్వర్వంశీయ క్షత్రియుల (హిందూ మతంలో ఒక కులం) హిందూ స్వాభిమానాన్ని (గౌరవాన్ని) ఉల్లంఘించడానికి, అరబ్ నుండి వచ్చిన విదేశీ దురా క్రమణదారులు, ముస్లిం పాలకులు, గోమాంస భక్షకులు, ఆవులను చంపడం, వాటి తోలు ఒలవడం, నిర్జన ప్రదేశాల్లో వాటి కళేబరాల్ని విసిరి వేయడం లాంటి అసహ్యకరమైన పనులను వారితో బలవంతంగా చేయించారు.ఆ విధంగా విదేశీ దురాక్రమణ దారులు, గర్వించ దగిన హిందూ ఖైదీలకు శిక్షగా అలాంటి పనుల అప్పజెప్పడం ద్వారా చర్మ-కర్మ (చర్మానికి సంబంధించిన) అనే ఒక కులాన్ని సృష్టించారని’ జోషి వివరించాడు.
ఇప్పుడు కులవ్యవస్థను ఒక సానుకూల దృష్టితో, ఈ జాతిని (హిందూ) రక్షించే వ్యవస్థగా చూపించే ఒక కొత్త ప్రయత్నం జరుగుతోంది. కులగణన చెయ్యాలనే డిమాండ్ పెరుగుతుండడంతో ఆరెస్సెస్ పత్రిక ‘పాంచజన్యం’ ఆగస్ట్ 5, 2024 న ‘ఓ నాయకా, నీవు ఏ కులానికి చెందినవాడివి’ అనే శీర్షికతో తేష్ శంకర్ రాసన వ్యాసాన్ని ప్రచురించింది.
విదేశీ దురాక్రమణదారులు కుల గోడలను బద్దలు కొట్టలేకపోయారనీ, కాబట్టి మత మార్పిడులు చేయలేక పోయారు. కులం, హిందూ సమాజం ప్రధానమైన పునాదిని కలిగి ఉంది. విదేశీ దురాక్రమణ దారులున్నప్పటికీ కూడా కులం, జాతిని ఆరోగ్యంగానే ఉంచిందని ఈ వ్యాసం వాదన. బొంబాయికి చెందిన మాజీ బిషప్, లూయిస్ జార్జ్ మిల్నే రచన’మిషన్ టు హిందూస్: ఏ కాంట్రిబ్యూషన్ టు ది స్టడీ ఆఫ్ మిషనర మెథడ్స్’ లోని ఒక అంశాన్ని ఆమోదిస్తూ ఉదహరించాడు. అది : ‘అప్పుడు, అది (కులం) అవసరం కొద్దీ సామాజిక నిర్మాణంలో ఒక భాగంగా ఉంది. ఇప్పటికీ అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం కులం, మిలియన్ల ప్రజలకు మతాన్ని నిర్మిస్తుంది. అది ఒకరి స్వభా వానికి, మతానికి మధ్య ఒక అనుసంధానంగా వ్యవహరిస్తుంది. (హిందీ వ్యాసం నుండి అనువాదం).
రచయిత చెప్పిన మాట ప్రకారం, అప్పుడు మిషనరీలకు వచ్చిన బాధే, ఈస్టిండియా కంపెనకి, లార్డ్ ఏ.ఓ.హ్యూమ్‌ల వార సత్వం గల భారత జాతీయ కాంగ్రెస్ బాధ. దురాక్రమణదారులు కుల గోడల్ని బద్దలు కొట్టలేకపోయారు కాబట్టి వారు (ముస్లింలు), ఆగ్రహంతో ఉన్న కులాలకు చెందిన వారిని సఫాయి పని చెయ్యాలని ఒత్తిడి చేశారు. ఇంతకు ముందు సమాజంలో ఇలాంటి వ్యవస్థకు సంబంధించిన ప్రస్తావన లేదు. మిషనరీలు చెప్పేదాని ప్రకారం, వారు సామాజిక వెనుకబాటుతనాన్ని కుల వ్యవస్థకు ఆపాదించారు. హితేష్ శంకర్ చె్పేదాని ప్రకారం, బ్రిటీష్ వారి వలె భారత జాతీయ కాంగ్రెస్ కూడా కులాన్ని, ఈ వ్యవస్థలో పక్కలో బల్లెం వలె చూసింది.
ఈ వ్యాసం అబద్ధాల సంకలనం. మనుస్మృతిలో కుల వ్యవస్థను చాలా బలంగా వివరించారు. (క్రీ.శ.2 వ శతాబ్దం, విదేశీ దురాక్రమణ దారులు రావడానికి చాలా ముందుగా). అట్టడుగు కులాల వారు అగ్రవర్ణాల వారికి దూరంగా ఉండాలని అనేక పవిత్ర గ్రంథాలు పేర్కొన్నాయి. అదే అంటరానితనానికి మూలం. దీని వ్యక్తీకణే సఫాయి పని. ఇది స్వచ్ఛత-కలుషిత ఆచారాలలో, పునర్జన్మ సిద్ధాంతంలో కూడా స్వభావికంగా ఉంటుంది. దీనికి సంబంధిం చిన ఇంతకు ముందు ప్రస్తావనలు నారద సంహిత, వాజసనేయి సంహితలో ఉన్నాయి. నారద సంహితలో అస్పృశ్యుల కోసం చేర్చబడిన 15 విధుల జాబితాలో మానవ మలమూత్రాలను ఎత్తిడం ఒక విధిగా ఉంది. వాజసనేయి సంహితలో మానవ మలమూత్రాలను ఎత్తివేసే పనిలో ఉన్న బానిసలను చండాలురుగా పేర్కొన్నారు.
అంబేద్కర్, కులాన్ని సమాజంపై బ్రాహ్మణీయ విధింపుగా భావించాడు. ఆరెస్సెస్ పత్రికలోని వ్యాసం కులవ్యవస్థను కీర్తిస్తుంటే, రాడికల్ దళిత మేధావులు, కార్యకర్తలు కులాన్ని హిందూ సమాజానికి పట్టిన చీడగా చూస్తున్నారు. అందుకే అంబేద్కర్, తన అనేక రచనల్లో ‘కుల నిర్మూలన’ కోసం పిలుపిచ్చాడు.
దామాషా పద్ధతిలో ప్రాతినిధ్యం, కులగణనలు ఆరెస్సెస్ నేతృత్వంలోని హిందూ జాతీయవాదులకు కంటగింపుగా ఉన్నాయి. దాని మూలాలు పూణేలో గాంధీ, అంబేద్కర్‌ల మధ్య జరిగిన ఒడంబడికలో ఉన్నాయి. ఆ తరువాత అది తన స్థానాన్ని భారత రాజ్యాంగంలో పొందింది. దీనిని వ్యతిరేకించడానికి చాలా నేర్పుగా, ప్రత్యక్షంగా 1980, 1985లలో అహ్మదా బాద్‌లో అల్లర్లు జరిగాయి. 1990లో మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేసినప్పుడు, రామ మందిరం ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చింది.
ఈస్ట్ ఇండియా కంపెనీ, హ్యూమ్‌ల వారసత్వంగా భారత జాతీయ కాంగ్రెస్ కు సంబంధించినంతవరకు, దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉండి, ఇప్పుడు భారతదేశ బహుళత్వ భావనను, దేశ వైవిధ్యాన్ని వ్యతిరేకిస్తున్న వారు మాత్రమే ఈ కల్పనను సష్టించగలరు. తిలక్ నుండి గాంధీ వరకు భారత జాతీయ కాంగ్రెస్, హ్యూమ్ భాగస్వామిగా ఉన్న బ్రిటిష్ పాలనకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. హ్యూమ్ దానిని సేఫ్టీ వాల్వ్‌గా భావించాడని ఆరోపించారు. లోతుల్లోకి వెళితే, మద్రాస్ మహాజన్ సభ (స్థాపకుడు, పానపాకం ఆనంాచార్యులు), బొంబాయి అసోసియేషన్ (స్థాపకుడు, జగన్నాథ్ శంకర్ షెట్) పూనా సార్వజనిక్ సభ (స్థాపకుడు, రణడే) లాంటి భారత జాతీయ సంస్థలు, వాటి డిమాండ్లు బ్రిటీష్ పాలకులకు చేరేందుకు ఒక రాజకీయ వేదిక కోసం ఎదురుచూశాయని ఎవరైనా గ్రహిస్తారు.
భారతదేశం డిమాండ్లను ముందుకు తీసుకొని వెళ్లడానికి ఒక జాతీయ వేదిక కోసం వారు ప్రయత్నం చేశారు కాబట్టి వారు భారత జాతీయ కాంగ్రెస్ పిలుపుకు స్పందించారు. ఇది, ప్రారంభంలో భారతదేశంలో ఐసీఎస్ కేంద్రాలను తెరవడానికి పిలుపునిచ్చింది.
భారత జాతీయ కాంగ్రెస్, భూస్వాములకు ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చింది, దాని వల్ల బందీలుగా ఉన్న కార్మికశక్తి విడు దల అవుతుంది. దానితో పాటు పెరుగుతున్న పారిశ్రామికీకరణను దష్టి ఉచుకొని కాంగ్రెస్ మరిన్ని సౌకర్యాల కోసం డిమాండ్ చేసిది. అదే భాత జాతీయ కాంగ్రెస్ ‘సంపూర్ణ స్వాతంత్య్రం’, ‘బ్రిటీష్ ్విట్ ఇండియా’ కోసం పిలుపునిచ్చింది. అంబేద్కర్ బలంగా ముందుకు తెచ్చిన సామాజిక న్యాయం అంశాన్ని తీసుకొని జాతీయోద్యమానికి నాయకత్వం వహించింది కూడా పాంచజన్యం లక్ష్యంగా పెట్టుకున్న ఆ కాంగ్రెస్సే.
భారత రాజ్యాంగ విలువలకు ప్రాతినిధ్యం వహించే అంబేద్కర్, హిందూ జాతీయవాదానికి ప్రతినిధిగా ఉంటున్న ఆరెస్సెస్ ల మధ్య గల వైరుధ్యం చాలా స్పష్టంగా ఉంది. అంబేద్కర్ మనుస్మతిని తగులబెట్టాడ. ఈ పవిత్ర గ్రంథంలో పేర్కొనబడిన కుల అసమానతలను ఆరెస్సెస్ సమర్ధిస్తుంది. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచిస్తే, ఆరెస్సెస్ ఆ రాజ్యాంగాన్ని చాలా కాలంపాటు ప్రత్యక్షంగా వ్యతిరేకించి, ఇప్పుడు పరోక్షంగా వ్యతిరేకిస్తుంది.
(”ది వైర్” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451
– రామ్ పునియానీ