
మండలంలోని పోచారం తండాలో బుదవారం రోజున ప్రమాదవశాత్తు మంటలంటుకొని గడ్డి వాములు, రెండు ఎడ్ల బండ్లు దగ్దమైన సంఘటన చోటు చేసుకుంది. పోచారంతండాకు చెందిన బన్సిలాల్ తన పశువులకు మేత నిమిత్తం తెచ్చుకున్నా గడ్డిని గ్రామా సమీపంలో గడ్డివాములు ఏర్పాటు చేసుకున్నాడు.అయితే వాటికి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది దీంతో రెండు గడ్డివాములతో పాటు అక్కడే ఉన్నా రెండు ఎడ్ల బండ్లకు నిప్పంటుకుందిఇది గమనించిన స్థానికులు మంటలార్పడానికి ప్రయత్నించారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పిన అధికంగా గడ్డి ఉండడంతో ఫలితం దక్కలేదుఈ ప్రమాదంలో బాధితుడు సుమారు రూ.1లక్ష వరకు నష్టం జరిగిందని యజమాని కంట నీరు పెట్టుకున్నాడు.