నవతెలంగాణ-ఆమనగల్
కడ్తాల్ మండల కేంద్రంతో పాటు వివిధ ప్రాంతా ల్లో బైకుల చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించి నట్టు ఎస్‌ఐ హరిశంకర్ గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తలకొండపల్లి మండలంలోని హర్య నాయక్ తాండా, పడకల్ గ్రామానికి చెందిన అరుణ్, నిఖిలేశ్వర్ ఇద్దరు కలిసి గత నెల రోజులుగా రాత్రి, పగటి సమయాల్లో బైక్ దొంగతనాలు చేస్తూ తిరుగుతున్నారు. వీరిద్దరూ కలిసి కడ్తాల్‌లో రెండు బైకులు, మక్తమాధారంలో ఒక బైకు, ఫలక్నుమలో ఒక స్కూటి మొత్తం నాలుగు ద్విచక్ర వాహనాలను దొంగి లించి ఎవరికి దొరకకుండా తప్పంచుకు తిరుగుతున్నా రు. ఈ క్రమంలో గురువారం తలకొండపల్లి చౌరస్తా కడ్తాల్ పరిధిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగిలించిన బైకుల గురించి ఒప్పుకున్నా రు. వారి వద్ద నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ నిమిత్తం వారిని ఆమనగల్ కోర్టుకు పంపినట్టు ఎస్‌ఐ హరిశంకర్ గౌడ్ తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ గోపాల్, కానిస్టేబుల్స్ రామ్ కోటి, యాదగిరి, శ్యాంశన్ లను పోలీస్ ఉన్నత అధికారులు అభినందించారు.