
మండల కేంద్రమైన రెంజల్ కెనరా బ్యాంకులో ఏపీఎం చిన్నయ్య, బ్యాంకు మేనేజర్ ల ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూప్ సి ఏ లకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంకు మేనేజర్ రాథోడ్ సాయినాథ్ మాట్లాడుతూ కెనరా బ్యాంకులో 310 సంఘాలకు గాను 30 సంఘాలు( ఎన్ పీ ఏ) 70 లక్షల వరకు ఉన్నాయని ఆయన తెలిపారు. బకాయి ఉన్న సంఘాల ద్వారా 15 రోజులలోపు వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన వివోఏ ల కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం చిన్నయ్య, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్, సీసీలు శ్యామల, భాస్కర్, శివకుమార్, వివో ఏలు, ఆయా గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు.