ఏకశిలలో అట్టహాసంగా ప్రారంభమైన సీబీఎస్ఈ క్లస్టర్ సెవెంత్ అథ్లెటిక్స్ పోటీలు

CBSE Cluster Seventh Athletics Competitions started with a bang in Ekashil– ప్రారంభించిన ప్రభుత్వ కార్యదర్శి సురేంద్రమోహన్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డులో గల ఏకశిలా అడ్వాన్సు లెర్నింగ్ పాఠశాలలో  సీబీఎస్ ఈ  క్లస్టర్ సెవెంత్ అథ్లెటిక్ పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుమారు 300 లకు పైగా  పాఠశాలలు పాల్గొననున్న ఈ అథ్లెటిక్స్ పోటీలను ప్రభుత్వ కార్యదర్శి సురేంద్రమోహన్ ప్రారంభించారు.సెప్టెంబర్ 14 నుంచి 19 వరకు ఈ అథ్లెటి క్స్ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యదర్శి సురేంద్రమోహన్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి శిక్షణ పొంది సాధన చేసి ఈ పోటీలో పాల్గొనడానికి విద్యార్థులు వచ్చారని ఇది వారి అంకిత భావానికి వేదిక అని తెలిపారు. క్రీడలు శారీరక దారుఢ్యనికే కాదు మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడతాయని తెలిపారు.ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్  తిరుపతి రెడ్డి  మాట్లాడుతూ సుమారు 9 వేల మంది  విద్యార్థులు పాల్గొననున్న ఈ పోటీలు సీబీఎస్ ఈ తరఫున  పాఠశాల పోటీలు నిర్వహించడం గర్వంగా ఉందని తెలిపారు. మా విద్యాసంస్థల్లో విద్యతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యత కల్పించి అంతే విధంగా వనరులను కూడా కల్పిస్తామని తెలిపారు.ఈ పోటీలలో పాల్గొనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏకశిలా విద్యాసంస్థల డైరెక్టర్ గౌరు సువిజా రెడ్డి , గౌరు జయ భరత్ రెడ్డి, గౌరు రిషిక్ రెడ్డి, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సనుప్ నాయర్ అకాడమిక్ ఇంచార్జ్ శాలిని నాయర్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు,  విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.