
ఏకశిలా అడ్వాన్సు లెర్నింగ్ స్కూల్, సాగర్ రోడ్ నల్గొండ నందు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుమారు 300 లకు పైగా పాఠశాలలు పాల్గొననున్న అథ్లెటిక్స్ పోటీలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 14 నుంచి 19 వరకు ఈ అథ్లెటి క్స్ పోటీలు జరగ నున్నాయి .ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా శ్రీ కే. సురేంద్రమోహన్ ఐఏఎస్ సెక్రటరీ టు గవర్నమెంట్ – మైన్స్ అండ్ జియాలజీ మరియు డాక్టర్ ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ కే సురేంద్రమోహన్ ఐఏఎస్ మాట్లాడుతూ మీరు ఎంతో కష్టపడి శిక్షణ పొంది సాధన చేసి ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చారని ఇది మీ అంకిత భావానికి వేదిక అని తెలిపారు. క్రీడలు శారీరక దారుణ్యానికే కాదు మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడతాయని తెలిపారు.ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సుమారు 9000 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొననున్న ఈ పోటీలు సీబీఎస్సీ తరఫున మా పాఠశాల నిర్వహించడం గర్వంగా ఉందని తెలిపారు. మా విద్యాసంస్థల్లో విద్యతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యత కల్పించి అంతే విధంగా వనరులను కూడా కల్పిస్తామని తెలిపారు.ఈ పోటీలలో పాల్గొనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏకశిలా విద్యాసంస్థల డైరెక్టర్ గౌరు సువిజా రెడ్డి , గౌరు జయ భరత్ రెడ్డి, గౌరు రిషిక్ రెడ్డి, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సనుప్ నాయర్ అకాడమిక్ ఇంచార్జ్ శాలిని నాయర్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందినటువంటి పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.