నవతెలంగాణ – రాజంపేట్
మండలంలోని ఆరేపల్లి గ్రామంలో శనివారం సుమారు పది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించినట్టు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యాదవ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సహకారంతో సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షులు అంకం కృష్ణారావు, ఎంపీటీసీ రాజు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బిక్కాజి దిలీప్ కుమార్, మాజీ సర్పంచ్ కొమ్ము యాదగిరి, చాకలి బాలయ్య, సంతోష్, రేస్మాయి వెంకటరావు,సతీష్ తదితరులు పాల్గొన్నారు.