నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సహకారంతో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని, గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నందుకు గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగారెడ్డి, భూమయ్య, అంజమ్మ, నర్సారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.