
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సహకారంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పది లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికి గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్నందుకు గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, వీడీసీ అధ్యక్షుడు సూర్యకాంత్ రెడ్డి, బాపురెడ్డి, వినోద్ గౌడ్, రమేష్ రెడ్డి, అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.