సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం : ఎమ్మెల్యే

నవతెలంగాణ-ఆమనగల్‌
కడ్తాల్‌ మండలంలోని మైసిగండి మైసమ్మ అమ్మవారి ఆలయం వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. రూ.15 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను నాణ్యతగా నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్‌ నాయక్‌, ఎంపీపీ కమ్లి మోత్యానాయక్‌, ఎంపీటీసీ సభ్యులు గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ తులసిరామ్‌ నాయక్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ చేగూరి వెంకటేష్‌, నాయకులు జవాహర్‌లాల్‌ నాయక్‌, గురిగల్ల లక్ష్మయ్య, గూడూరు భాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారి సన్నిధిలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు..
మైసిగండి మైసమ్మ అమ్మవారి సన్నిధిలో శుక్రవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఎమ్మెల్యే దంపతులను పూర్ణకుంభంతో ఆహ్వానించి సాంప్రదాయ పద్ధతిలో పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.