
మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా ఐదు లక్షలు మంజూరు కావడంతో మేనూర్ గ్రామంలో స్మశానవాటిక వెళ్లే మార్గం లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు వేగవతంగా కొనసాగుతున్నాయని గుతేదారు మిరాజ్ తెలిపారు. ఈ సందర్బంగా మిరాజ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి స్మానాన వాటికకు రోడ్డు లేక పోవడం తో వర్ష కాలంలో గ్రామస్తులు ఎవరైనా మరణిస్తే ఎంతో ఇబ్బంది పడుతూ మృతదేహాన్ని తీసుకువెళ్లె వారని మేనూర్ గ్రామ సమస్యని తెలుసుకుని, వెంటనే నిధులు మజూరు చేసి పనులు కొనసాగేలా కృషి చేసిన జుక్కల్ నియోజక వర్గా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ కి మేనూర్ గ్రామస్తుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంతోష్ , సిరాజ్ ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.