జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కృషితో మంజూరైన ఐదు లక్షల నిధులతో మద్నూర్ మండలంలోని చిన్న తడగూర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులు పెద్ద తడగూర్ కొండావార్ రాజు ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. చురుగ్గా సాగుతున్న సీసీ రోడ్డు పనుల పర్యవేక్షణలో చిన్న తడగూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గంగారాం, బాలాజీ ,శంకర్, మాధవరావు పటేల్, తుకారం, తడుగూరు నాగనాథ్, తదితరులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.