
మండలంలోని బట్ట తండాలో శుక్రవారం సీసీ రోడ్డు పనులను మాజీ సర్పంచ్ రెడ్డి నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దికుంట నరస గౌడ్, గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద రూ 10 లక్షలతో సిసి రోడ్డు పనులు ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ లచ్చిరాం, కాంగ్రెస్ నాయకులు విట్టల్ నాయక్, బోజు నాయక్, రాజు నాయక్, రాథోడ్ రవి నాయక్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.