సీసీ రోడ్డు పనులు ప్రారంభం

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని కంచర్ల గ్రామంలో మంగళవారం ఎంపీపీ గాల్ రెడ్డి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని, రూ.10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, ఎన్ఆర్ఐ సెల్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు తిరుపతి గౌడ్, కంచర్ల అధ్యక్షులు సాయ గౌడ్, నర్సాగౌడ్, శేఖర్ రెడ్డి, బిక్షపతి, తిరుపతి రెడ్డి, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.