ఖానాపూర్ గ్రామంలో సిసి రోడ్డు పనులు ప్రారంభం..

నవతెలంగాణ- ఆర్మూర్
మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఎన్ఆర్ జిఎస్ ద్వారా 10 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులు ప్రారంభించినట్టు గ్రామ సర్పంచ్ సింగిరెడ్డి మోహన్ బుధవారం తెలిపారు. గ్రామ అభివృద్ధికి, గ్రామంలో నెలకొన్న సమస్యలపై త్వరితగతిన స్పందిస్తూ.. అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.