సీసీ, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ 

CC, municipal chairperson who laid foundation stone for drainage worksనవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీ లో రూ. 25 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు కామారెడ్డి పట్టణ మున్సిపల్ చైర్మన్ గడ్డం  ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి శనివారం  శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ ఇలియాస్, పట్టణ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం చైర్ పర్సన్  మాట్లాడుతూ డివిజన్ లో ఒకే సారి కాల్వల నిర్మాణం కోసం రూ. 25 లక్షలతో శంకుస్థాపన చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేని అన్నారు. షబ్బీర్ అలీ  జిల్లా కేంద్రంలో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఇక్కడి ప్రజలు వారి ఇబ్బందులను షబ్బీర్ అలీ  దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి నిధులను విడుదల చేయించారన్నారు. షబ్బీర్ అలీ  నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో కామారెడ్డి పట్టణ రూపు రేకలు మారిపోతుందని, అభివృద్దిలో ముందుకు దూసుకుపోతోందని ఆమె పేర్కొన్నారు.