సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని కొనసాగించాలి 

– బీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు కల్లూరీ రవి విజ్ఞప్తి 

నవతెలంగాణ – బెజ్జంకి 
నేటితో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటనలు చేస్తున్నారని మరో రెండు నెలలు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని బీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు కల్లూరీ రవి మంగళవారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మండలంలో సుమారు 50 శాతం పత్తి దిగుబడి పంటచెల్లోనే ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కొనుగోలు కేంద్రాలను కొనసాగించేల సత్వర చోరవ చూపాలని కోరారు.సీసీఐ కొనుగోలు కేంద్రాల మూసివేతతో దళారులు సిండికేట్ అయి పత్తి రైతులపై మోసాలకు పాల్పడుతారని రాష్ట్ర ప్రభుత్వానికి రవి సూచించారు.రైతు బందును పూర్తి స్థాయిలో అమలు చేసి అదుకోవాలని కోరారు.