– 10 వేల మంది విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ
హైదరాబాద్ : సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోందని హెచసీఏ అధ్యక్షుడు జగనమోహన రావు వెల్లడించారు. బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు దేశంలోని వివిధ సినీ ఇండిస్టీ ప్రముఖులు ఈ లీగ్‌లో ఆడనున్నారని చెప్పారు. ఈ లీగ్ తొలి అంచె పోటీలు ఇప్పటికే షార్జాలో జరుగుతుండగా, రెండో అంచె మ్యాచ్‌లు వచ్చే నెల 1వ తేదీ నుంచి మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలుగు వారియర్స్ జట్టుకు హిరో అక్కినేని అఖిల్ నాయకత్వం వహిస్తున్నాడని చెప్పారు. ‘రోజుకు రెండు మ్యాచ్‌లు చొప్పున మొత్తం ఆరు మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తున్నాం. కళాశాల విద్యార్థులను ఉచితంగా అనుమతించాలని సీసీఎల్ నిర్వాహకులను నేను కోరగా వారు అంగీకరించారు. రోజుకు పది వేల మంది విద్యార్థులకు కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వనున్నాం. ఆసక్తి గల విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ తమ విద్యార్థుల పేర్లను హెచసీఏ ఈమెయిల్ ఐడీకి ఈనెల 27వ తేదీలోపు పంపించాలి’ అని జగనమోహన రావు తెలిపారు.