వ్యభిచారం నిర్వహిస్తే కఠినచర్యలు తప్పవు: సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 

వ్యభిచారం నిర్వహిస్తే కఠినచర్యలు తప్పవని సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకునే అమ్మాయిలను కొందరు వ్యభిచార కూపంలోకి లాగుతున్నారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్థిక స్థితిగతులను ఆసరాగా చేసుకొని మభ్యపెడుతున్నారన్నారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు.