– సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి
– కలెక్టరేట్ ముందు అంగన్వాడీల ధర్నా
నవ తెలంగాణ మహబూబ్ నగర్
అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వం సీసీ కెమెరాలు బయోమెట్రిక్ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలను దొంగలుగా చిత్రీకరిస్తూ, అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెట్టాలనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ,అంగన్వాడీ కేంద్రాలకు ఒకపూట బడితోపాటు మే నెల అంతా టీచర్స్ కు హెల్పర్స్ కు సెలవులు ఇవ్వాలన్నారు. పనిచేయని సెల్ఫోన్లను తిరిగి వాపస్ తీసుకోవాలని కొత్త 5జి ట్యాబులు సరఫరా చేయాలన్నారు. గత ప్రభుత్వంలో 24 రోజుల సమ్మె సందర్భంగా జీతాలు చెల్లిస్తామని హామీని అమలు పరచాలని, అంగన్వాడీ హెల్పర్లకు పాత పద్ధతిలోనే ప్రమోషన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రమోషన్ వయసు 50 సంవత్సరాల పెంచాలన్నారు.ఆన్‌లైన్ సమస్యల వల్ల ఆగిపోయిన వారికి వెంటనే వేతనాలు చెల్లించాలన్నారు. సెంటర్ అద్దెలు, గ్యాస్ బిల్లులు, ఆరోగ్యలక్ష్మి మెనూ చార్జీలు తదితర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, పిఆర్సి ఏరియార్స్ 2021 జులై అక్టోబర్ నవంబర్ 3 మాసాలవి వెంటనే చెల్లించాలన్నారు. గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ పర్మినెంట్ చేసి కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు. పిఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడి టీచర్లను ఎల్పర్లకు గ్రాటిటీ చెల్లించాలని. రెండో పి.ఆర్.సి ప్రకారం ను అంగన్వాడి టీచర్స్ హెల్పర్లకు వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. రెండో పీఆర్సీ ఫైనల్ చేసేటప్పుడు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు పేస్కేల్ ప్రకారం కనిష వేతనం నిర్ణయించాలని. రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్‌కు రెండు లక్షలు హెల్పర్ కు లక్ష ,ఆసరా పెన్షన్, 60 సంవత్సరాలు దాటిన వారికి విఆర్‌ఎస్ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని .మట్టి ఖర్చుల జీవో నెంబర్ 11 సవరించాలని అంగన్వాడీ హెల్పర్లకు కూడా టీచర్లతో సమానంగా 20 వేల రూపాయలు నిర్ణయించి అమలు పరచాలన్నారు. రాష్ట్రంలో ఐసిడిఎస్ లో ఉన్న ఆన్లైన్ యాప్లు అన్నింటిని రద్దు చేయాలని. ఒకే యాప్ ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని. 2017 నుండి టీఏడీఏ ఇంక్రిమెంటు ఇంచార్జ్ అలవెన్సులు బకాయిలు మొత్తం చెల్లించాలని. దీనికి సరిపడా బడ్జెట్ను వెంటనే రిలీజ్ చేయాలని. ఆరోగ్య లక్ష్మి మెను ఛార్జీలు పిల్లలకు ఒక రూపాయి 15 పైసల నుండి ఐదు రూపాయలకు పెంచాలని, గర్భిణీ బాలింతలకు రెండు 40 పైసల నుండి పది రూపాయలకు పెంచాలని ,డబుల్ సిలిండర్సు అన్ని కేంద్రాలకు ఇవ్వాలని తెలిపారు. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటిని అమలు చేయాలన్నారు. అనంతరం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సరోజ ఉపాధ్యక్షురాలు ప్రభావతి ,రాజ్యలక్ష్మి గౌస్య బేగం, పద్మ, కవిత ,కమల తదితరులు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె కైనా సిద్ధమవుతామని కాంగ్రెస్ ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దాలన్నిటిని అమలు పరచాలని వారు డిమాండ్ చేశారు. సీఐటీయూ పట్టణ కన్వీనర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే ఎడల ఉద్యమాన్ని ఉధతం చేస్తామన్నారు. అంగన్వాడీలు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఏవో శంకర్‌కి వినతి పత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ కలెక్టర్ డిడబ్ల్యుఓ తో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని స్థానికంగా ఉండే ప్రతి సమస్య పరిష్కారానికి కషి చేస్తామని హామీలు ఇచ్చారు.