
నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని వంకాయగూడెం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో గ్రామ సభలు సీడీసీ స్రవంతి ఆధ్వర్యంలో శుక్రవారం గర్భిణీ స్త్రీలకు పిల్ల తల్లులకు పోషకాహారం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ నాగార్జున హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సహకరించడమే కాకుండా అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేస్తుందన్నారు. జిల్లావ్యాప్తంగా అంగన్వాడి కేంద్రాలలో మూడు నుండి ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఎల్కేజీ, యూకేజీ స్థాయిలో విద్యను అందిస్తుంది అన్నారు. పూర్వ ప్రాథమిక విద్యనందిస్తున్న అంగన్వాడి కేంద్రాలను మరింత బలోపేతం చేయాలన్నారు. అనంతరం పీహెచ్ డాక్టర్ శ్యామ్ గోపాల్ మాట్లాడుతూ.. స్త్రీలలో రక్తహీనత, పిల్లలకు అందించే పోషకాహారంపై, పలు సూచనలు చేశారు. మేనరికం పెళ్లిళ్లు చేసుకోవడంతో పుట్టబోయే పిల్లల్లో జన్యు లోపం చూపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి రాంబాబు, ఎంపీడీవో శ్రీవాణి, ఎంపీఓ బసిరుద్దీన్, పంచాయతీ కార్యదర్శి నరసయ్య, గ్రామ ప్రజలు అంగన్వాడి సిబ్బంది, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.