పలు రికార్డులను పరిశీలిస్తున్న సిడిపి బృందం

నవతెలంగాణ- జమ్మికుంట:
పట్టణంలోని పలు పాఠశాలల్లో సోమవారం సిడిపి బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడారు. సర్కారు బడుల ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభ్యున్నతి సాధించడంపై, తద్వారా చదువుల్లో విద్యార్థుల అభ్యసన కనీస సామర్ధ్యాలు, ప్రగతిని పరిశీలించేందుకు డైట్ కరీంనగర్ నుండి సిడిపి(కంటిన్యూవస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్) బృందం  జమ్మికుంట మండలంలోని ఉన్నత పాఠశాల బాలురు, బాలికలు అలాగే తొలిమెట్టులో భాగంగా బాలికల ప్రాథమిక పాఠశాల, అంబేడ్కర్ కాలనీ పాఠశాలలను  కూడా సందర్శించారని తెలిపారు. వీరు పాఠశాలలోని బేస్ లైన్ టెస్ట్  పేపర్స్ ను పరిశీలించడం, సమ్మెటివ్ అసెస్మెంట్ పేపర్ వాల్యుయేషన్, అలాగే ఉపాధ్యాయుల టీచింగ్ డైరీ ని ఎలా రాశారో, పాఠశాలల్లోని విద్యార్థులకు ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఎలా బోధిస్తున్నాడు, అలాగే ప్రతి ఉపాధ్యాయుడు వారు రాసిన లెసన్ ప్లాన్స్ లోని స్టెప్స్ ను పరిశీలించి, తదుపరి ప్రతి ఉపాధ్యాయునికి ఉన్నతి కార్యక్రమం పైన, పదవ తరగతి విద్యార్థులకు లక్ష్య ప్రోగ్రామ్ పైన పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ టీం బృందం పరిశీలనలో బి. ఓదెలు కుమార్, ఎండి షరీఫ్ అహమద్, సురేఖ, సరిత ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దామెర సుధాకర్, ఆకుల సదానందం, రాజ్ కుమార్, శకుంతల  ఉపాధ్యాయులు సిఆర్పిలు సురేష్, మహేందర్ తిరుపతి, వనిత, శ్రుతకీర్తి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.