అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసిన సిడిపిఓ..

నవతెలంగాణ: రెంజల్ : మండల కేంద్రమైన రెంజల్ గ్రామంలోని 4 అంగన్వాడి కేంద్రాలను సిడిపిఓ జానకి, సూపర్వైజర్ ప్రమీల రాణిలు సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. చిన్నారులకు పరిసరాల పరిశుభ్రత గురించి వివరిస్తూ భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడగాలని సూచించారు. ప్రతి నెల మొదటి వారంలో పిల్లల బరువులను తూచి వారికి తగినంత పోషకాహరాన్ని అందించాలని వారు అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు . పిల్లలకు సమయానుకూలంగా పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లోని స్టాకును వెరిఫికేషన్ చేయడం జరిగింది. మరియు అంగన్వాడీ టీచర్లు సమయపాలన పాటిస్తూ పిల్లలను శ్రద్ధతో చూడాలని ఆమె అన్నారు. ఆమె వెంట అంగన్వాడి టీచర్లు సుజాత, పద్మ, రజిత, రాజ్యలక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు.