ప్రీ స్కూల్ విద్యా బోధన చేయాలి: సీడీపీఓ జ్యోతి

నవతెలంగాణ – ఆర్మూర్ 

అంగన్వాడి కేంద్రాలకు వచ్చే బాల బాలికలకు ఆటపాటల ద్వారా ప్రీస్కూల్ నూతన విద్యా బోధన చేయాలని ఐసీడీఎస్ ఆర్మూర్ ప్రాజెక్ట్ ఇంచార్జ్ సీడీపీఓ జ్యోతి అన్నారు. పట్టణంలోని పెర్కిట్ సీడీపీఓ కార్యాలయం ఎందు శుక్రవారం మండలంలోని అంగన్వాడి టీచర్లకు ఏర్పాటుచేసిన నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా రివైజ్ ప్రీ స్కూల్ పై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల పిల్లల నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని, ఈ సందర్భంగా అంగన్వాడి ఉపాధ్యాయులకు నూతన విద్యా విధానం, ఫ్రీ స్కూల్ అంశాలపై ఆమె అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ శ్రీదేవి, రేఖ ,సూపర్వైజర్లు వెంకట రమణమ్మ ,అన్నపూర్ణమ్మ, రామ ,అనురాధ, సునంద, ఏ స్తేరు రాణి, కోఆర్డినేటర్ విలాస్, సాగర్ అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.