చదువు ఉంటేనే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారు: సీడీపీఓ మల్లీశ్వరి

నవతెలంగాణ – గోవిందరావుపేట
చదువు ఉంటేనే మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా ప్రతిభ కనబరుస్తూ  ప్రథమ స్థానాన్ని సాధిస్తారని సిడిపిఓ జి మల్లేశ్వరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడువాయి ప్రాజెక్ట్ సిడిపిఓ మల్లీశ్వరి హాజరై మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో మహిళలు ముందుండాలంటే చదువులో ముందుండాలని చదువుకుంటేనే అది సాధ్యమని అన్నారు. నేటి తల్లిదండ్రులు ఆడ మగ అనే తేడా లేకుండా ఇద్దరినీ ఒకే తీరున స్ఫూర్తితో చదివించాలని సూచించారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ టి అనంతలక్ష్మి, సఖి కేసు వర్కర్ సాధన, ఎంపీ  పిఎస్ పాఠశాల హెచ్ఎం రఘురాం, హై స్కూల్ హెచ్ఎం ఎన్ అన్నా మేరీ, అంగన్వాడీ టీచర్స్ ఎం విజయలక్ష్మి పి రాణి పి విజయలక్ష్మి జి కరుణ ఆయాలు ఆశా కార్యకర్తలు బాలింతలు గర్భిణీ స్త్రీలు కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.