
నవతెలంగాణ – తాడ్వాయి
మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని, స్వయం సమృద్ధి సాధించాలని తాడ్వాయి సిడిపిఓ మల్లీశ్వరి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని తాడ్వాయి-1 అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మల్లీశ్వరి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో తమ చాతుర్యాన్ని చాటుతున్నారని అన్నారు. భవిష్యత్తులో అన్ని రంగాల్లో మరింత ముందుకు దూసుకెళ్లి ప్రపంచ స్థాయిలో మహిళలు దేశ ఖ్యాతిని చాటాలన్నారు. మహిళలు ఐక్యమత్యంతో తమ సమస్యలను సాధించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ విజయ, అంగన్వాడీ టీచర్లు జమునరాని ఆదిలక్ష్మి రుక్మిణి రజిత ప్రెసిడెంట్ కొట్టెం మల్లికాంబ వివో లీడర్ సరిత తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.