రెండున్నరేళ్ళ పిల్లలను అంగన్వాడీల్లో చేర్చాలి: సీడీపీఓ

Two-and-a-half-year-old children should be included in Anganwadis: CDPO– సీడీపీఓ ఆధ్వర్యంలో అమ్మ మాట.. అంగన్వాడి బాట.. ర్యాలీ కార్యక్రమం
నవతెలంగాణ – మద్నూర్
రెండున్నర పిల్లలకు చదువుల కోసం అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలని మద్నూర్ మండల కేంద్రంలో సోమవారం నాడు ఐసీడీఎస్ మద్నూర్ ప్రాజెక్ట్ సీడీపీఓ సునంద ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడి బాట ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల కంటే అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ చిన్నారి పిల్లలకు మంచి చదువులు అందిస్తున్నామని తెలిపారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాల అభ్యుదయ స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు కవిత వినోద కొమరవ్వ నసీమా బేగం అంగన్వాడి టీచర్లు ఏఎన్ఎం స్వప్న ఆశా వర్కర్లు అంగన్వాడి పిల్లలు అభ్యుదయ పాఠశాల పిల్లలు పాల్గొన్నారు.