
పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో మంగళవారం పోషణపక్షం కార్యక్రమం నిర్వహించారు.ఐసిడిఎస్ సూపర్వైజర్ సునంద మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రంలో అందజేసే పోషక ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు, బాలింతలే స్వీకరించాలని, బిడ్డ పుట్టిన గంట లోపే పాలు పట్టించాలని, బిడ్డ పుట్టిన నుండీ ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని, పలు సూచనలు చేశారు.కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, గర్భిణీ స్త్రీలు,తదితరులు ఉన్నారు.