ఉద్యోగానికి న్యాయంగా పనిచేసిన సీడీపీఓ సునంద

CDPO Sunanda who did justice to the job– ఉద్యోగ విరమణలో ఉమ్మడి జిల్లా ఉద్యోగుల మన్ననలు.. మీ సేవలు అమూల్యమైనవి

నవతెలంగాణ – మద్నూర్
ప్రతి శాఖలో ఉద్యోగాలు చేసిన వారు ఉద్యోగ విరమణ పొందక తప్పదు కానీ ఉద్యోగానికి న్యాయంగా పనిచేసిన మద్నూర్ ఐసిడిఎస్ సీడీపీఓ సునాంధలాంటి వారు చాలా తక్కువ. ఎందుకంటే ఆమె ఉద్యోగ విరమణ మహోత్సవ కార్యక్రమం మద్నూర్ మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఉన్నతమైన శాఖల అధికారులు హాజరయ్యారు. వీరితోపాటు మద్నూర్ ఎంపీడీవో రాణి ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి పద్మ మద్నూర్ మండల కేంద్ర మాజీ ఎంపీటీసీలు గడ్డం లక్ష్మణ్ సంగీత కుశాల్ పాల్గొన్నారు. ఈ పదవి విరమణ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, మద్నూర్ సీడీపీఓ సునంద పనితీరుపై చాలా గొప్పగా తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పలు ప్రాజెక్టుల్లో పని చేసిన కూడా ఎక్కడ ఆమె పనితీరు ఆ శాఖ ఉద్యోగస్తుల యొక్క మండలాలు పొందారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మద్నూర్ సీడీపీఓ సునంద పనితీరును ఆదర్శంగా తీసుకొని ఉద్యోగానికి న్యాయం చేయాలని కోరారు. ఈ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో జిల్లా అధికారులు మండల అధికారులు మాజీ ప్రజా ప్రతినిధులు మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టులోని సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.