నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని వివిధ గ్రామాలలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు ఐసిడిఎస్ ఆలేరు సెక్టర్ సూపర్వైజర్ ఉషారాణి తెలిపారు మండలంలోని నెల్లికుదురు సెక్టార్, రాజుల కొత్తపల్లి సెక్టర్, మేచరాజుపల్లి సెక్టర్ ఆలేరు సెక్టార్ పరిధిలోని ఆలేరు, వావిలాల మేచరాజు పల్లి, నెల్లికుదురు, మునిగల వీడు, లాలు తండా, గ్రామాల తో పాటు వివిధ గ్రామాలలో గురువారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిపాల వారోత్సవాల లో భాగంగా తల్లుల సమావేశం ఏర్పరచి గర్భిణీలను బాలింతలను రెండు సంవత్సరాల లోపు పిల్లల తల్లులను మరియు కిషోర్ బాలికలను ఆహ్వానించి తల్లిపాలపై అవగాహన కల్పించమైనది అని తెలిపారు. బిడ్డ పుట్టిన వెంటనే వీలైనంత త్వరగా తల్లిపాలు పట్టించే ఆ పాలను ముర్రుపాలు అంటారని ముర్రుపాలలో వ్యాధినిరోధక శక్తి ఉంటుందని అన్నారు. ఇది బిడ్డ జీవితానికి ఎంతో మేలు చేస్తుందని వివరించారు దీంతో తల్లి బిడ్డ మధ్య అనుబంధం పెరుగుతుందని తెలిపారు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఇంకా ఏ ఇతర పదార్థాలు బిడ్డకు పట్ట రాదని తల్లులకు వివరించామన్నారు. ప్రతి తల్లి తన బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వలన రొమ్ముక్యాన్సర్లు మరియు అండాశయ క్యాన్సర్లను నిరోధించవచ్చు అని చెప్పారు. తలులకు ఉన్న అపోహలను తొలగించేలా తల్లిపాలపై అవగాహన కల్పించనైనది ప్రతి బాలింత సంపూర్ణ ఆహారం తీసుకొని బిడ్డకు తల్లిపాలే ఇవ్వాలని ఈ సందర్భంగా తల్లులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తోట్ల వెంకటలక్ష్మి, మద్ది విజయ ,ఎల్ పద్మ , నల్ల మాస శ్రీలక్ష్మి,కె పద్మ, ఎం పద్మ ,టి జ్యోతి, ఏ మాధవి మంజుల, రాజేశ్వరి ,దేవకి ఎల్తూరి సునీత, బి పద్మ , వీరలక్ష్మి, వెంకటమ్మ, జమాల్బి, ఆశ వర్కర్లు హేమలత, నీరజ స్కూల్ హెచ్ఎం సైదులు పాషా, ఉపాధ్యాయుడు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.