ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సీడీపీఓ డిచ్పల్లి వారి ఆధ్వర్యంలో జిజిహెచ్ లో తల్లిపాల వారోత్సవాలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ.. 9 నెలలు మోసి కన్న బిడ్డలను పెంచడంలో తల్లి పాత్ర ప్రముఖమైనదని, తల్లిపాలలో అద్భుతమైన శక్తి ఉంటుందని, పుట్టిన బిడ్డకు వెంటనే స్తన్యం ఇవ్వడం చాలా అవసరమని తెలిపారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 1-7 తేదీ వరకు ప్రపంచ దేశాలలో తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటారని తెలిపారు. తల్లిపాలు బిడ్డలకు పోషకాలను అందించడమే కాకుండా పసి వయసులో వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయని సూచించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి స్వర్ణలత, కోఆర్డినేటర్ రంజిత్ ,అంగన్వాడీ టీచర్లు సురేఖ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.