ఘనంగా చల్మెడ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు గారి 62వ జన్మదిన వేడుకలను  పట్టణ పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు.  జిల్లా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా రాజన్న సన్నిధిలో స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. చల్మెడ లక్ష్మీనరసింహారావు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ రాజన్నను వేడుకుంటున్నామని తెలిపారు. అనంతరం చల్మెడ స్వగృహంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి రామచందర్, నరాల శేఖర్,  గోలి మహేష్, జోగిని శంకర్, పట్టణ సీనియర్ నాయకులు మాదాడి గజానందరావు, పొలాస నరేందర్,  వెంగళ శ్రీకాంత్ గౌడ్, జీవన్ గౌడ్,  లైసెట్టి మల్లేశం, పాషా, నాయకులు వెంకట్ రెడ్డి, పోతూ అనిల్ కుమార్, దుర్గం మహేష్,  గజ్జల రమేష్,  హింగే కుమార్, దమ్మ భాస్కర్ రాము, మంతే సందీప్, తీగల హరీష్ గౌడ్, జేపీ రావు, రాకేష్, మహేందర్, చిన్న జడల శీను, అంబటి సంతోష్,  రాజేశం గౌడ్, రవిచంద్ర గౌడ్, అక్రమ పాషా, అప్సర్, ప్రసాద్,  మండల పార్టీ అధ్యక్షులు గోస్కుల రవి, బియ్యాల ప్రమోద్, పార్వతి మహేష్, బాలకిషన్, దేవరాజు, తదితరులు పాల్గొన్నారు.