ఘనంగా పౌరహక్కుల దినోత్సవం 

నవతెలంగాణ – రామగిరి 
రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు అధ్వర్వంలో పౌర హక్కుల దీనోత్సవం ఘనంగ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య ఎస్సై మధుసూదన్ మాట్లాడారు. పౌర హక్కులు ఎవరు ఉల్లంఘించినా చట్టరీత్యా నేరమని, ముఖ్యంగా మహిళలపై అఘాయితలకు పాల్పడరాదని, యువత చెడువ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని వారన్నారు. ఈకార్యక్రమంలో ఆర్ఐ పొట్ట రాజబాపు,  కార్యదర్శి పర్శరాం హెచ్ఎం బాలశివా రెడ్డి, హెల్తు సూపర్వేజర్ సీతారాములు, హెల్త్ డిపార్ట్మెంట్ లత,ఏఎన్ఎం స్వరూప, ఆశ వర్కర్ నీల, రాము, అంకయ్య, నవీన్, రాకేష్, గట్టయ్య, తిరుపతి, సాగర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.