
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, జెడ్పీటీసీ శ్రీరామ్ సుధీర్ మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఎర్రబెల్లి దయాకర్ రావు దే అని అన్నారు. పలువురు యూత్ నాయకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు దుంపల సమ్మయ్య, విశ్వనాథుల జ్ఞానేశ్వర చారి, చింతల భాస్కర్, ధరావత్ రాజేందర్, భీమా, ఆరుట్ల వెంకట్ రెడ్డి, రెడ్డబోయిన గంగాధర్, వీరన్న, కృష్ణమూర్తి, నీలం సోమయ్య, చిలుక బిక్షపతి, షర్ఫీద్దీన్, రాంమూర్తి, దుంపల వేణు, అనుదీప్, మహేష్, యాకన్న తదితరులు పాల్గొన్నారు.