కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై 10న డిమాండ్స్ డే ను జయప్రదం చేయాలని సీఐటీయూ కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు ఈ సందర్భంగా మండల కేంద్రం లోని గ్రామ పంచాయితీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిమాండ్స్ డే ను జయప్రదం చేయాలని ఉద్ధరించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ.. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేస్తామని, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేస్తామని, అందులో భాగమే కొత్త బొగ్గు బ్లాక్ లను సింగరేణికి కేటాయించకుండా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడానికి వేలం వేస్తున్నదని,పిఎఫ్ కట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న యజమానులపై వేసే పెనాల్టీని తగ్గించిందని, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బి.ఎస్.ఎన్.ఎల్ ను నాశనం చేసి, ఇప్పుడు జియో, ఎయిర్టెల్ సంస్థల సెల్ ఫోన్ చార్జీలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని, 73 రంగాల షెడ్యూల్ పరిశ్రమల వేతనాలు పెంచకుండా కేవలం జీవో నెంబర్లు మార్చి గెజిట్ చేయడం దుర్మార్గమని, ముఖ్యమంత్రి పరిశ్రమల యజమానులు,కార్పొరేట్ సంస్థల అధిపతులతో మాత్రమే చర్చిస్తున్నారని,రాష్ట్రంలోని కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చించడం లేదని, కార్మిక శాఖ మంత్రి ని కూడా ఇప్పటివరకు నిర్ణయించలేదని, అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు నెలల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయని.
ఈ సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, అందుకే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోవాలని, కనీస వేతనం నెలకు రూ.26,000 ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపివేయాలని, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, వివిధ రంగాల కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని,పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని తదితర డిమాండ్లతో జులై 10న మండల, పట్టణ,పారిశ్రామిక కేంద్రాల్లో డిమాండ్స్ నిర్వహించాలని సీఐటీయూ పిలుపునిచ్చిందని. అందులో భాగంగా జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు జులై జులై 10న పెద్ద ఎత్తున డిమాండ్స్ డే కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ ఆకుల రాజయ్య, జీపీ యూనియన్ మండల నాయకులు వి, శ్రీనివాస్, నరసయ్య, చంద్రయ్య, మురళి, అనసూర్య శంకరమ్మ, లచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.