ఘనంగా నాగుల పంచమి వేడుకలు

– పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న మహిళలు
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
నాగుల పంచమిని సందర్భంగా దుబ్బాక మండల వ్యాప్తంగా ఆలయాలు కిటకిటలాడాయి. శుక్రవారం తెల్లవారు జాము నుండి  మండల పరిధిలోని రఘోత్తంపల్లి,రామక్కపేట, పద్మనాభుని పల్లి, తిమ్మాపూర్ ఇతర గ్రామాల్లోని ఎల్లమ్మ దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల పంచమి పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలోని పుట్టలో మహిళలు పాలు పోసి మొక్కలు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలోని పుట్టలో పాలు పోయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోయడం ద్వారా నాగ దోషాలు తొలుగుతాయని విశ్వసించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే వారికి ఎవరికి ఎలాంటి ప్రాణహాని పాముల ద్వారా కలగవద్దని ఉద్దేశంతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయాల వద్ద మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో ఉన్నారు.