నవతెలంగాణ – బెజ్జంకి మండల పరిధిలోని దాచారం అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార వారోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరభ్యాసం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఏఎన్ఎం వినోద, అంగన్వాడీ కేంద్రాల ఉపాధ్యాయులు డీ.స్వరూప, పీ.స్వరూప, జే.పద్మ, వీఓలు సరోజన, స్రవంతి, ఆశా కార్యకర్త రేణుకా, మహిళలు పాల్గొన్నారు.