భక్తి శ్రద్దలతో రంజాన్ వేడుకలు..

– రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్..
నవతెలంగాణ – వేములవాడ 
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. గురువారం ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్ధనల అనంతరం, ముస్లిం సోదరులను ఆత్మీయ అలింగణం చేసుకొని రంజాన్  శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ..  ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజులు లోక కళ్యాణ ఆర్థం అత్యంత భక్తి శ్రద్దలతో ఉపవాసం ఉండి సమాజంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకుంటారని అన్నారు. సకాలంలో వర్షాలు పడి రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటూ ప్రజలు పాడి పంటలతో సుఖసంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అన్నారు.రంజాన్  శాంతి ప్రేమ దయ సౌబ్రతుత్వ గుణాలను పంచుతుందన్నారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో మీ ముందుకు వచ్చి మీ మద్దతు కోరిన సందర్భంలో మీరు నాపై నమ్మకం ఉంచి నా గెలుపులో భాగస్వామ్యం అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మన లౌకిక దేశంలో అన్ని మతాల అన్ని కులాల అన్ని వర్గాల సమానం అన్నారు. వేములవాడ పట్టణంలో జరిగే పండుగలు అన్ని కూడా మత సామ్రాస్యానికి ప్రత్యేకంగా నిలిచేలా హిందూ ముస్లిం భాయి భాయి  అనేలా నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మన్నన్, కళింపాషా, రజాక్, మత పెద్దలు, మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.